Andhra Pradesh: సంక్షోభంలో పోరాడేవాడు కావాలి.. నీలా పార్టీని కూల్చేవాడు కాదు!: కేశినేనికి బుద్ధా వెంకన్న కౌంటర్

  • బుద్ధా వెంకన్న టార్గెట్ గా కేశినేని ట్వీట్లు
  • తిప్పికొట్టిన టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా
  • చంద్రబాబు కోసం పోరాడేవాళ్లు కావాలని వ్యాఖ్య

విజయవాడ లోక్ సభ సభ్యుడు, టీడీపీ నేత కేశినేని నాని ఈరోజు హాట్ హాట్ కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. నాలుగు ఓట్లు సంపాదించలేనివాడు నాలుగు పదవులు సంపాదిస్తున్నాడని నాని వ్యాఖ్యానించారు. నాలుగు పదాలు, నాలుగు వాక్యాలు కూడా చదవలేనివాడు ట్వీట్లు చేస్తున్నాడనీ, నిజంగా ఇది దౌర్భాగ్యమని అన్నారు. టీడీపీ నేత బుద్ధా వెంకన్నను టార్గెట్ గా చేసుకునే కేశినేని నాని ఈ కామెంట్లు చేశారని సోషల్ మీడియాలో జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేశినేని నాని ట్వీట్ కు బుద్ధా వెంకన్న కౌంటర్ ఇచ్చారు.

సంక్షోభం సమయంలో పార్టీ కోసం, పార్టీ నాయకుడి కోసం పోరాడేవాడు కావాలని బుద్ధా వెంకన్న తెలిపారు. అంతే తప్ప ఇతర పార్టీ నాయకులతో కలిసి ఆయన(కేశినేని)లా పార్టీని కూల్చేవాడు చాలా ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అవకాశవాదులు కాకుండా టీడీపీ అధినేత చంద్రబాబు కోసం చనిపోయేవరకూ సైనికుడిలా పోరాడేవాడు కావాలని చెప్పారు. ఈ మేరకు బుద్ధా వెంకన్న ట్విట్టర్ లో స్పందించారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News