Ramlal: బీజేపీ కీలక నేత రామ్‌లాల్‌కు ఆరెస్సెస్ పిలుపు.. మరో బాధ్యత అప్పగింత

  • సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శిగా ఉన్న రామ్‌లాల్
  • రామ్‌లాల్ సమర్థతలను దృష్టిలో పెట్టుకునే కీలక బాధ్యతలు
  • ఇకపై బీజేపీ, సంఘ్‌కు సమన్వయకర్తగా రామ్‌లాల్

బీజేపీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శిగా ఐదేళ్లుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆ పార్టీ కీలక నేత రామ్‌లాల్‌కు ఆరెస్సెస్ అఖిల భారత సంపర్క్ ప్రముఖ్ బాధ్యతలను అప్పగించింది. ఆరెస్సెస్ జాతీయ సమావేశాలు జరుగుతుండగానే ఈ నిర్ణయం వెలువడటం విశేషం.

బీజేపీ చాలా రాష్ట్రాల్లో విస్తరించడానికి ఆయన చేసిన కృషి, సమర్థతలను దృష్టిలో పెట్టుకుని ఆరెస్సెస్ ఆయనకు ఈ బాధ్యతలను అప్పగించింది. ఆరెస్సెస్ ప్రచారక్‌గా ఉన్న సమయంలోనూ ఆయన చాలా కీలకంగా వ్యవహరించేవారు. ప్రస్తుతం రామ్‌లాల్ బీజేపీకి, సంఘ్‌కు సమన్వయకర్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇక ఆయన స్థానంలో తాత్కాలికంగా సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శిగా జి.సతీశ్‌ బాధ్యతలను నిర్వర్తించనున్నారు.  

Ramlal
BJP
RSS
Sathish
Temporarily
  • Loading...

More Telugu News