World Cup: వరల్డ్ కప్ ట్రోఫీని ముందుపెట్టుకుని ఫొటోలకు పోజులిచ్చిన ఇంగ్లాండ్, నూజిలాండ్ కెప్టెన్లు

  • రేపటితో ముగియనున్న క్రికెట్ సంబరం
  • ఆదివారం లార్డ్స్ మైదానంలో వరల్డ్ కప్ ఫైనల్
  • అమీతుమీ తేల్చుకోనున్న ఇంగ్లాండ్, న్యూజిలాండ్

గత కొన్నివారాలుగా క్రికెట్ ప్రేమికులను ఉర్రూతలూగించిన ఐసీసీ వరల్డ్ కప్ రేపు జరిగే ఫైనల్ తో ముగియనుంది. ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఈ ప్రపంచకప్ సమరంలో టైటిల్ కోసం ఆతిథ్య ఇంగ్లాండ్, గతేడాది రన్నరప్ న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఆదివారం ఈ రెండు జట్ల పోరాటానికి విశ్వవిఖ్యాత లార్డ్స్ మైదానం వేదికగా నిలుస్తోంది.

ఈ నేపథ్యంలో, ఇరుజట్ల కెప్టెన్లు వరల్డ్ కప్ ట్రోఫీతో ఫొటో సెషన్ లో పాల్గొన్నారు. ఇంగ్లాండ్ సారథి ఇయాన్ మోర్గాన్, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ వరల్డ్ కప్ ట్రోఫీకి ఇరువైపులా నిలబడి మీడియా ప్రతినిధుల కెమెరాలకు పోజులిచ్చారు. లార్డ్స్ లోని ప్రెస్ బాక్స్ కు అభిముఖంగా ఉన్న హాల్ లో ఈ కార్యక్రమం నిర్వహించారు.

World Cup
Cricket
New Zealand
England
  • Loading...

More Telugu News