Hyderabad: పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకున్న నిందితుడు

  • ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న లావణ్య
  • నేటి ఉదయం లావణ్యపై దాడికి యత్నం
  • సాయి కిరణ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

హైదరాబాద్, రాజేంద్రనగర్‌‌లో నేటి ఉదయం మాజీ భార్యపై దాడికి యత్నించిన సాయికిరణ్ పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకున్నాడు. బండ్లగూడ మున్సిపాలిటీ పరిధిలో తన పిల్లలతో ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటున్న లావణ్యపై ఆమె మాజీ భర్త సాయి కిరణ్ దాడికి యత్నించాడు. విషయాన్ని గ్రహించిన లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సాయి కిరణ్‌ను అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి కొడవలి, పెట్రోల్‌ను స్వాధీనం చేసుకున్నారు. అయితే పోలీసుల అదుపులో ఉన్న సాయికిరణ్ వారి కళ్లు గప్పి స్టేషన్ నుంచి పరారయ్యాడు. పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Hyderabad
Sai Kiran
Lavanya
Police Station
Bandlaguda
  • Loading...

More Telugu News