Alapati Raja: పిట్ట కథలు వినేందుకే బాగుంటాయి: వైసీపీపై ఆలపాటి రాజా ధ్వజం

  • అందుకే వైసీపీ చర్చను పక్కదారి పట్టిస్తోంది
  • జగన్ వ్యవహార శైలి ఏమాత్రం బాగోలేదు
  • తొలి విడతలోనే జగన్ విఫలమయ్యారు

పిట్ట కథలు వినేందుకు బాగుంటాయి కానీ.. వాటితో ఉపయోగం ఉండదంటూ వైసీపీ వ్యవహార శైలిపై టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజా మండిపడ్డారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, వాస్తవాలను మరుగున పడేసేందుకే అసెంబ్లీలో వైసీపీ చర్చను పక్కదారి పట్టిస్తోందని విమర్శించారు.

ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి రాష్ట్ర అభివృద్ధిపై కనీస అవగాహన కూడా లేదని విమర్శించారు. సభలో సీఎం జగన్ వ్యవహార శైలి సైతం ఏమాత్రం బాగోలేదని విమర్శించారు. తాను తలచుకుంటే 23 మంది ఎమ్మెల్యేలు ఇక్కడ కూర్చోలేరంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో సరికాదన్నారు. జగన్ తొలి విడతలోనే రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే విషయంలో విఫలమయ్యారని రాజా విమర్శించారు.

Alapati Raja
Buggana Rajendranath Reddy
YSRCP
Assembly
  • Loading...

More Telugu News