AAP: బీజేపీని ఇరకాటంలో పడేసిన ఆప్ ఎమ్మెల్యేలు

  • ఆప్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారని తెలిపారన్న సౌరభ్
  • ఆ ఇద్దరూ ఆప్‌లోనే కొనసాగుతున్నారని స్పష్టం
  • బీజేపీ నేతలు చెబుతున్న వీడియో ప్రదర్శన

ఆమ్ ఆద్మీ పార్టీ రెబల్ ఎమ్మెల్యేలు ఇద్దరు నేడు స్పీకర్ ఎదుట తాము బీజేపీలో చేరిన మాట అవాస్తవమని, తాము ఆమ్ ఆద్మీలోనే కొనసాగుతున్నామని చెప్పి బీజేపీని ఇరకాటంలో పడేశారు. ఈ విషయమై ఆప్ అధికార ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ మీడియాతో మాట్లాడుతూ, బీజేపీ సీనియర్ నేతలు విజేంద్ర గుప్త, విజయ్ గోయల్‌లు తమ పార్టీకి చెందిన ఇద్దరు నేతలు బీజేపీలో చేరారని చెప్పారని తెలిపారు. అయితే ఆఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని, తమ పార్టీలోనే కొనసాగుతున్నారని సౌరభ్ స్పష్టం చేశారు. స్పీకర్ రామ్ నివాస్ గోయల్, సదరు ఆప్ ఎమ్మెల్యలిద్దరినీ వివరణ కోరగా, తాము ఆప్‌తోనే ఉంటామని తేల్చి చెప్పినట్టు సౌరభ్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలిద్దరూ తమ పార్టీలో చేరారని బీజేపీ నేతలు చెబుతున్న వీడియోను మీడియా ఎదుట ప్రదర్శించారు.

AAP
Vijendra Gupta
Vijay Goel
Sourbh Bharadwaj
BJP
Video
  • Loading...

More Telugu News