Andhra Pradesh: ఏపీ బీజేపీలో రేపు భారీగా చేరికలు.. టీడీపీ త్వరలో ఖాళీ అయిపోతుంది!: కన్నా లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు

  • చాలామంది మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు రాబోతున్నారు
  • ఎవరెవరు వస్తారో రేపటి వరకూ వేచి చూడండి
  • విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఏపీ బీజేపీ చీఫ్

ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరబోతున్నారని ప్రకటించారు. రాజేశ్ సింగ్ చౌహాన్ ఆధ్వర్యంలో వీరంతా రేపు బీజేపీలో చేరుతారని తెలిపారు. టీడీపీ త్వరలోనే ఖాళీ అయిపోతుందని కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. అయితే ఏయే నేతలు బీజేపీలో చేరబోతున్నారో వేచిచూడాలని మీడియాకు సూచించారు. విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో కన్నా మాట్లాడారు.

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ కాగితంపై బాగానే ఉన్నప్పటికీ, అమలులో కనిపించబోదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు తరహాలోనే ఏపీ సీఎం జగన్ పాలన సాగుతోందని దుయ్యబట్టారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజల మనిషనీ, ఆయన్ను ఎవ్వరితోనూ పోల్చలేమని స్పష్టం చేశారు. సీఎం జగన్ చెబుతున్న మాటలు, హామీలను చేతల్లో చూపించాలని కన్నా డిమాండ్ చేశారు.

Andhra Pradesh
BJP
kanna
lakshmi narayana
ap bjp chief
Telugudesam
Jagan
Chief Minister
Chandrababu
  • Loading...

More Telugu News