Andhra Pradesh: ఆంధ్రాలో పొలిటికల్ ఎన్ కౌంటర్లతో కక్షపూరిత పాలన సాగుతోంది!: టీడీపీ నేతలు

  • సీఎం జగన్ ఏపీలో పులివెందుల కల్చర్ తీసుకొస్తున్నారు
  • సాక్షాత్తూ అసెంబ్లీలో టీడీపీ సభ్యులను బెదిరిస్తున్నారు
  • ప్రభుత్వంపై విరుచుకుపడ్డ టీడీపీ నేతలు రామానాయుడు, జవహర్

ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ ఎన్ కౌంటర్లతో కక్షపూరిత పాలన సాగుతోందని టీడీపీ నేతలు రామానాయుడు, జవహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ సాక్షాత్తూ అసెంబ్లీ వేదికగా టీడీపీ సభ్యులను బెదిరిస్తున్నారని విమర్శించారు. ఇటీవల పశ్చిమగోదావరి జిల్లాలోని కాళ్లకూరులో వైసీపీ శ్రేణుల దాడిలో గాయపడ్డ మాజీ సర్పంచ్ అడ్డాల శివరామరాజును వారు పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. సీఎం జగన్ రాష్ట్రవ్యాప్తంగా పులివెందుల కల్చర్ ను తీసుకొస్తున్నారని దుయ్యబట్టారు. టీడీపీ కార్యకర్తలపై దాడులు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. కార్యకర్తలు, మద్దతుదారులకు టీడీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

Andhra Pradesh
Telugudesam
YSRCP
Jagan
jawahar
ramanaidu
  • Loading...

More Telugu News