cricketer verendra sehwag: వ్యాపార భాగస్వాముల మోసంపై క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ భార్య ఫిర్యాదు

  • తన భర్త పేరు ఉపయోగించుకున్నారని ఆగ్రహం
  • తమ సంతకాలు ఫోర్జరీ చేసి రుణం తీసుకున్నారని ఆరోపణ
  • బకాయిలు చెల్లించడం లేదని ధ్వజం

వ్యాపార భాగస్వాములతో వచ్చిన విభేదాల నేపథ్యంలో వారిపై టీమిండియా మాజీ క్రికెటర్‌, డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ భార్య ఆర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ సంతకాలు ఫోర్జరీ చేసి భాగస్వాములు మోసానికి పాల్పడ్డారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. తన భర్త సెహ్వాగ్‌ పేరును ఉపయోగించుకోవడమేకాక, సంతకాలు కూడా ఫోర్జరీ చేసి బ్యాంకుల నుంచి తమకు తెలియకుండా 4.5 కోట్ల రూపాయలు రుణంగా తీసుకున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా బ్యాంకుకు రెండు పోస్టు డేటెడ్‌ చెక్కులు కూడా ఇచ్చారని తెలిపారు. తీసుకున్న రుణం బకాయిలు సక్రమంగా తీర్చకుండా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. భాగస్వాముల మోసంపై చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదులో కోరారు. అయితే ఈ వివాదంలోని పూర్తి వివరాలు మాత్రం వెల్లడి కాలేదు.

cricketer verendra sehwag
wife arthi
Cheating
police complaint
businesspartners
  • Loading...

More Telugu News