Andhra Pradesh: వ్యవసాయదారులకు సీఎం జగన్ ప్రకటించిన పథకాలు చరిత్రలో నిలిచిపోతాయ్!: విజయసాయిరెడ్డి

  • ప్రత్యేక బడ్జెట్ వ్యవసాయ రంగానికి ఊపిరిపోస్తుంది
  • రైతులకు ఇచ్చిన మాటను ఏపీ సీఎం నిలబెట్టుకున్నారు
  • ట్విట్టర్ లో స్పందించిన విజయసాయిరెడ్డి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిన్న ప్రకటించిన ప్రత్యేక బడ్జెట్ వ్యవసాయ రంగానికి ఊపిరి పోస్తుందని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తెలిపారు. తుపాన్లు, కరవుకాటకాలతో తల్లడిల్లిన ఏపీ రైతన్నలను రూ.29,000 కోట్ల కేటాయింపులు సంక్షోభం నుంచి గట్టెక్కిస్తాయని వ్యాఖ్యానించారు.  

ఈరోజు ట్విట్టర్ లో విజయసాయిరెడ్డి స్పందిస్తూ..‘తుపాన్లు, కరవుకాటకాలతో తల్లడిల్లిన వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జెట్ ఊపిరి పోస్తుంది. రూ.29 వేల కోట్ల కేటాయింపు రైతన్నలను సంక్షోభం నుంచి గట్టెక్కిస్తుంది. వడ్డీలేని రుణం, ధరల స్థిరీకరణ నిధి, కౌలు రైతులకు పంట రుణాలు చరిత్రలో నిలిచిపోతాయి. జగన్ గారు రైతులకిచ్చిన మాట నిలుపుకున్నారు’ అని ట్వీట్ చేశారు.

Andhra Pradesh
Jagan
YSRCP
Chief Minister
Vijay Sai Reddy
Twitter
schemes
  • Loading...

More Telugu News