Kala Venkatrao: ఏపీ బడ్జెట్ కొత్త సీసాలో పాత సారాలా ఉంది: కళా వెంకట్రావు

  • అంకెల గారడీ తప్ప చిత్తశుద్ధి లేదన్న టీడీపీ నేత
  • విత్తనాలు కూడా అందించలేని స్థితిలో ప్రభుత్వం ఉందంటూ విమర్శ
  • విద్యుత్ రంగానికి రూ.400 కోట్లు ఏం సరిపోతాయంటూ నిలదీత 

ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ పై టీడీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు బడ్జెట్ పై తన అభిప్రాయాలు వెల్లడించారు. ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన బడ్జెట్ కొత్త సీసాలో పాత సారాలా ఉందని విమర్శించారు. బడ్జెట్ యావత్తూ అంకెల గారడీ తప్ప కేటాయింపుల్లో చిత్తశుద్ధిలేదని అన్నారు. కనీసం రైతులకు విత్తనాలు కూడా అందించలేని స్థితిలో ప్రభుత్వం ఉందని, విద్యుత్ రంగానికి రూ.400 కోట్లు ఏ మూలకు సరిపోతాయని నిలదీశారు. ఈ బడ్జెట్ రైతులు, పేదలు, యువతకు ఏమాత్రం ప్రోత్సాహకరంగా లేదని అభిప్రాయపడ్డారు. బడ్జెట్ లో రాష్ట్రాభివృద్ధిని పరిగణనలోకి తీసుకున్న దాఖలాలు ఎక్కడా కనిపించలేదని అన్నారు. 

Kala Venkatrao
Telugudesam
Andhra Pradesh
YSRCP
  • Loading...

More Telugu News