Prashanth: ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యం.. ఒకరి మృతి

  • ప్లాట్ ఫాంపైకి దూసుకొచ్చిన ఆర్టీసీ బస్సు
  • అక్కడికక్కడే మృతి చెందిన లక్ష్మణ్
  • పలువురికి గాయాలు.. ఆసుపత్రికి తరలింపు

ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఓ నిండు ప్రాణం బలవగా, మరికొందరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కామారెడ్డి జిల్లా మాదారెడ్డి మండలం ఫరీద్‌పేట గ్రామానికి చెందిన గుంటి లక్ష్మణ్(38)తో పాటు అతని బావమరిది ప్రశాంత్ నేడు హైదరాబాద్‌కు పయనమయ్యారు. వీరిద్దరూ కామారెడ్డి బస్టాండ్‌కు చేరుకోగానే, ప్రశాంత్ డబ్బులు డ్రా చేసేందుకు ఏటీఎంకు వెళ్లాడు.

ఇంతలోనే ఓ ఆర్టీసీ బస్సు అతి వేగంగా ఫ్లాట్ ఫాంపైకి దూసుకొచ్చింది. అక్కడే కూర్చొని ఉన్న లక్ష్మణ్‌కు కనీసం తప్పుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. వెంటనే వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు విచారణ నిర్వహిస్తున్నారు.

Prashanth
Lakshman
Kamareddy
Bus stand
RTC Bus
Plat Form
  • Loading...

More Telugu News