Amala Paul: రెండో పెళ్లి చేసుకున్న అమలాపాల్ మాజీ భర్త

  • వైద్యురాలు ఐశ్వర్యను పెళ్లాడిన విజయ్
  • 2014లో ప్రేమ వివాహం చేసుకున్న విజయ్, అమలాపాల్
  • మూడేళ్ల తర్వాత విడిపోయిన జంట

సినీ నటి అమలాపాల్ మాజీ భర్త, తమిళ దర్శకుడు విజయ్ రెండో వివాహం చేసుకున్నాడు. వైద్యురాలు ఐశ్వర్యను పెళ్లాడాడు. వీరి పెళ్లి ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఐశ్వర్యను పెళ్లి చేసుకోబోతున్నట్టు గత నెల 29న విజయ్ ప్రకటించాడు. అత్యంత సన్నిహితుల సమక్షంలో పెళ్లి జరగనున్నట్టు తెలిపాడు. ఇది పెద్దలు కుదిర్చిన వివాహమని... తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని మొదలు పెట్టబోతున్నానని చెప్పాడు. మరోవైపు అమలాపాల్, విజయ్ 2014లో ప్రేమ వివాహం చేసుకున్నారు. మనస్పర్థలు రావడంతో మూడేళ్ల వైవాహిక జీవితం తర్వాత ఇద్దరూ విడిపోయారు.

Amala Paul
Vijay
Second
Marriage
Kollywood
  • Loading...

More Telugu News