Andhra Pradesh: కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే సున్నా వడ్డీ పథకం ఉంది!: టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు

  • జగన్ నిండు సభలో అబద్ధాలు చెప్పారు
  • టీడీపీ సున్నా వడ్డీ పథకం అమలు చేయలేదన్నారు
  • ఈరోజు రూ.630 కోట్లు ఇచ్చినట్లు ఒప్పుకున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ నిన్న నిండు అసెంబ్లీలో అవాస్తవాలు చెప్పారని టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు విమర్శించారు. సీఎం జగన్ చెప్పిన సున్నా వడ్డీ పథకం మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి హయాం నుంచే ఉందనీ, కొత్తగా కనిపెట్టిన పథకం కాదని వ్యాఖ్యానించారు.

ఈ విషయాన్ని తాను సభలో చెప్పడంతో సీఎం జగన్ ఎంతో ఆవేశంగా మాట్లాడారన్నారు. ఏపీ అసెంబ్లీలో మీడియా పాయింట్ వద్ద రామానాయుడు ఈరోజు మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం రైతులకు సున్నా వడ్డీ పథకం కింద ఏమీ ఇవ్వలేదని నిన్న సీఎం జగన్ చెప్పారనీ, ఈరోజు మాత్రం రూ.630 కోట్లు ఇచ్చినట్లు అంగీకరించారని తెలిపారు.

Andhra Pradesh
Telugudesam
ramanaidu
YSRCP
Jagan
Chief Minister
  • Loading...

More Telugu News