Jagan: జగన్ వాడుతున్న భాష నీచంగా ఉంది: బీజేపీ నేత మాణిక్యాలరావు

  • అసెంబ్లీలో గాడిదలు అంటూ మాట్లాడడం సరికాదు
  • సీఎం స్థాయి వ్యక్తికి హుందాతనం అవసరం
  • గ్రామ వలంటీర్లుగా వైసీపీ కార్యకర్తలను నియమించుకుంటున్నారు

బీజేపీ నేత, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు సీఎం జగన్ పై విమర్శలు చేశారు. అసెంబ్లీలో జగన్ మాట్లాడుతున్న తీరు అభ్యంతరకరంగా ఉందని అన్నారు. అసెంబ్లీలో గాడిదలు అంటూ మాట్లాడడం సబబు కాదని, ఇది నీచమైన భాష అని విమర్శించారు. సీఎం పదవిలో ఉన్న వ్యక్తి నుంచి ఎవరూ ఇటువంటి భాషను ఆశించబోరని, హుందాగా వ్యవహరించాలని తెలిపారు. ఇక, గ్రామ వలంటీర్ల నియామకంపైనా మాణిక్యాలరావు స్పందించారు. గ్రామ వలంటీర్లుగా వైసీపీ కార్యకర్తలనే నియమించుకుంటున్నారంటూ ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం రేషన్ డీలర్లకు అన్యాయం చేయాలని చూస్తోందని, అలా జరిగితే తాము పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

Jagan
YSRCP
Manikyalarao
BJP
Andhra Pradesh
  • Loading...

More Telugu News