Cricket: క్రికెట్ తీరుతెన్నులపై బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి వ్యాఖ్యలు

  • ఐసీసీ లండన్ లోనే ఎందుకు కేంద్రీకృతమైంది?
  • శ్రీనివాసన్ ను తప్పించి ఓ మెతకవాడ్ని చైర్మన్ గా కూర్చోబెట్టారు
  • వర్షం పడకుండా ఉంటే టీమిండియానే గెలిచేది

గెలుస్తున్నంతకాలం విమర్శలు పెద్దగా లెక్కలోకి రావు కానీ, ఓటమిపాలైతే విమర్శలు బాణాలై గుచ్చుతుంటాయి. ఏ రంగమైనా ఇందుకు మినహాయింపు కాదు. ముఖ్యంగా, క్రీడారంగం గెలుపు-ఓటమి చుట్టూనే పరిభ్రమిస్తుంటుంది కాబట్టి దీంట్లో సునిశిత విమర్శకు ఎప్పుడూ విలువ ఉంటుంది. తాజాగా, టీమిండియా వరల్డ్ కప్ సెమీస్ లో ఓడి ఇంటిముఖం పట్టిన నేపథ్యంలో బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.

"ఐసీసీ ఎందుకు లండన్ లోనే కేంద్రీకృతమై ఉండాలి? తమకు కొరకరాని కొయ్యలా ఉన్నాడని శ్రీనివాసన్ ను తెల్లవాడు తెలివిగా పక్కకి తప్పించాడు. ఓ మెతక భారతీయుడ్ని తెచ్చి ఐసీసీకి చైర్మన్ గా కూర్చోబెట్టారు. యూకేలో దాదాపుగా ఎప్పుడూ వాన ముప్పు ఉంటుంది. సెమీస్ లో వర్షం పడకుండా, అదే రోజు మ్యాచ్ పూర్తయి ఉంటే మాత్రం కచ్చితంగా భారతే గెలిచి ఉండేది" అంటూ తన అభిప్రాయాలను పంచుకున్నారు.

  • Loading...

More Telugu News