apple iphone: యాపిల్‌ ఐఫోన్‌...మేడ్‌ ఇన్‌ ఇండియా.. ధర తక్కువేనట!

  • బెంగళూరులో అసెంబ్లింగ్‌ యూనిట్‌
  • వచ్చేనెల మార్కెట్లోకి రానున్న ఎక్స్‌ఆర్‌, ఎక్స్‌ఎస్‌
  • దిగుమతి సుంకాలు లేకపోవడంతో ధరపై ప్రభావం

యాపిల్‌ ఐఫోన్‌  మేడ్‌ ఇన్‌ ఇండియా మార్కెట్లోకి రావడానికి రెడీ అవుతోంది. ఈతరం కుర్రకారు క్రేజీగా భావించే ఐఫోన్‌ ఎంత ఆకర్షణీయంగా ఉంటుందో ధర అంత ఆకాశంలో ఉంటుంది.  విదేశాల్లో తయారయ్యే ఈ ఫోన్‌ భారత్‌కు వచ్చేసరికి దిగుమతి సుంకాల కారణంగా ఎక్కువ ధర పలుకుతుంది. దీంతో డిమాండ్‌ ఉన్నా మార్కెట్‌పై అధిక ధర ప్రభావాన్ని గుర్తించిన యాపిల్‌ సంస్థ టాప్‌ ఎండ్‌ ఐఫోన్లను భారత్‌లోనే అసెంబిల్‌ చేసేందుకు బెంగళూరులో ప్రత్యేక యూనిట్‌ను నెలకొల్పిన విషయం తెలిసిందే. ఈ యూనిట్‌లో రూపొందించిన ఐఫోన్‌ ఎక్స్‌ ఆర్‌, ఎక్స్‌ఎస్‌ ఫోన్లు ఆగస్టులో మార్కెట్లోకి రానున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇండియాలో తన ఫోన్లను అసెంబిల్‌ చేయడమేకాక సొంతంగా స్టోర్లను కూడా ప్రారంభించాలని యాపిల్‌ సంస్థ నిర్ణయించింది. దీనివల్ల దేశీయ మార్కెట్లో ఐఫోన్‌ ధర గణనీయంగా తగ్గుతుందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి.

apple iphone
made in India
two series
shortly in market
  • Loading...

More Telugu News