India: టీమిండియా దిగ్గజం ధోనీపై సృతీ ఇరానీ వ్యాఖ్యలు

  • ప్రపంచకప్ సెమీస్ లో కివీస్ చేతిలో భారత్ ఓటమి
  • చివర్లో రనౌట్ గా వెనుదిరిగిన ధోనీ
  • ఓటమికి అతనే కారణమంటూ పలువురి విమర్శలు

వరల్డ్ కప్ లో భారత్ ఓటమికి ధోనీయే కారణమని చాలామంది విమర్శిస్తున్న తరుణంలో కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ తన వ్యాఖ్యలతో క్రికెట్ దిగ్గజానికి మద్దతుగా నిలిచారు. "ధోనీ సాధించిన మహత్తరమైన విజయం ఏంటో తెలుసా?... 5 పరుగులకే 3 వికెట్లు కోల్పోయినా 1.25 వందల కోట్ల మంది ధోనీ ఉన్నాడన్న నమ్మకంతో గెలుపుపై చివరివరకు ఆశలు పెట్టుకున్నారు" అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. నిజంగానే ధోనీ చివరి ఓవర్లలో విజృంభిస్తాడని సగటు అభిమానులు ఆశించినా, అదృష్టం మొహంచాటేయడంతో ధోనీ రనౌట్ రూపంలో వెనుదిరగాల్సి వచ్చింది. కోహ్లీ కూడా ధోనీ రనౌట్ మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేసిందని చెప్పాడు.

India
MS Dhoni
Smriti Irani
  • Loading...

More Telugu News