Sivaji: నాకు కుదరదు... విచారణకు రాలేను: పోలీసులకు ఈమెయిల్ పంపిన శివాజీ

  • అలంద మీడియా కేసులో శివాజీ
  • లుకౌట్ నోటీసులు జారీ
  • ఇటీవల అమెరికా వెళుతుండగా అడ్డుకున్న అధికారులు

టాలీవుడ్ నటుడు శివాజీ పేరు అలంద మీడియా వ్యవహారంలో ప్రముఖంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. టీవీ9 చానల్ వాటాలకు సంబంధించిన వివాదంలో ఆయనపైనా కేసు నమోదైంది. విదేశాలకు వెళ్లకుండా లుకౌట్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. ఇటీవలే ఆయన అమెరికా వెళ్లేందుకు ప్రయత్నించగా, శంషాబాద్ లో అధికారులు అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు.

ఈ సందర్భంగా పోలీసులు విచారణకు రావాలంటూ శివాజీకి నోటీసులు అందించారు. అయితే, తాను అలంద మీడియా వ్యవహారంలో విచారణకు రాలేనంటూ శివాజీ తెలిపారు. తన కొడుకును అమెరికా పంపాల్సి ఉందని, దానికి సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నానని వెల్లడించారు. ఈ మేరకు సైబరాబాద్ పోలీసులకు ఈమెయిల్ ద్వారా తెలిపారు.

Sivaji
Tollywood
TV9
Alanda Media
Hyderabad
  • Loading...

More Telugu News