Ravindra Jadeja: కృతజ్ఞతలు చెప్పడం అనేది చాలా చిన్నమాట: రవీంద్ర జడేజా ఎమోషనల్ ట్వీట్

  • సెమీస్ లో కివీస్ చేతిలో భారత్ ఓటమి
  • జడేజా అద్భుత పోరాటం
  • విమర్శకులు సైతం జడేజాపై ప్రశంసలు

న్యూజిలాండ్ తో వరల్డ్ కప్ సెమీఫైనల్లో భారత్ ఓటమిపాలైనా రవీంద్ర జడేజా పోరాటం మాత్రం అందరినీ ఆకట్టుకుంది. తీవ్ర ఒత్తిడిలో జడేజా ఆడిన ఇన్నింగ్స్ ను విమర్శకులు సైతం ప్రశంసిస్తున్నారు. కాగా, టోర్నీలో తమ ప్రస్థానం ముగియడంపై జడేజా భావోద్వేగాలతో కూడిన ట్వీట్ చేశాడు.

"ప్రతి పతనం తర్వాత పైకిలేవడం ఎలాగో క్రీడలు నాకు నేర్పాయి. ఓటమిని అంత తేలిగ్గా అంగీకరించవద్దన్న దృక్పథం కూడా క్రీడల ద్వారానే అలవడింది. అపారమైన స్ఫూర్తిని కలిగించిన ప్రతి అభిమానికి థ్యాంక్స్ చెప్పడం చాలా అల్పమైన విషయం. మీ మద్దతుకు కృతజ్ఞతలు. మీరు ఇలాగే స్ఫూర్తి రగుల్చుతుండాలి. నా తుదిశ్వాస వరకు అత్యుత్తమ క్రికెట్ ఆడేందుకు ప్రయత్నిస్తాను" అంటూ జడేజా ట్వీట్ చేశాడు.

Ravindra Jadeja
India
New Zealand
World Cup
Semifinal
  • Loading...

More Telugu News