Australia: 14 పరుగులకే 3 వికెట్లు డౌన్... ఇంగ్లాండ్ పేస్ ను ఎదుర్కోలేక ఆసీస్ ఆపసోపాలు!

  • వోక్స్ కు రెండు వికెట్లు
  • ఆర్చర్ సూపర్ స్పీడ్
  • కష్టాల్లో కంగారూ టీమ్

సొంతగడ్డపై జరుగుతున్న ప్రపంచకప్ లో టైటిల్ గెలవాలని పట్టుదలగా ఉన్న ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఆస్ట్రేలియాతో సెమీఫైనల్ మ్యాచ్ లో కసిగా బౌలింగ్ చేస్తున్నారు. ఫించ్, వార్నర్ వంటి అగ్రశ్రేణి బ్యాట్స్ మెన్ సైతం ఇంగ్లాండ్ పేసర్లను ఎదుర్కోవడంలో తడబాటుకు గురయ్యారు. దాంతో ఆసీస్ 14 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది.  ఫించ్ డకౌట్ కాగా, వార్నర్ 9 పరుగులు చేసి వెనుదిరిగాడు. జోఫ్రా ఆర్చర్ గంటకు 145 కిలోమీటర్లకు పైగా వేగంతో బంతులు విసురుతూ కంగారూలను హడలెత్తిస్తుండగా, క్రిస్ వోక్స్ తెలివైన బౌలింగ్ తో వికెట్లు రాబట్టాడు. వోక్స్ ధాటికి వార్నర్, హ్యాండ్స్ కోంబ్ బలయ్యారు. ఫించ్ ను మొదట్లోనే ఆర్చర్ అవుట్ చేశాడు. బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా 7 ఓవర్లలో 3 వికెట్లకు 15 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో స్టీవ్ స్మిత్, అలెక్స్ కేరీ ఆడుతున్నారు.

కాగా, ఆర్చర్ అమిత వేగంతో విసిరిన ఓ బంతి కేరీ హెల్మెట్ ను ఎగరగొట్టడమే కాకుండా, గడ్డానికి గాయం చేసింది. బంతి సీమ్ తగలడంతో కేరీకి రక్తస్రావమైంది. దాంతో మెడికల్ టీమ్ మైదానంలోకి వచ్చి కేరీకి తగిలిన గాయానికి చికిత్స చేయాల్సి వచ్చింది.

  • Loading...

More Telugu News