Andhra Pradesh: ఏపీ అసెంబ్లీలో కరవుపై చర్చ.. వైసీపీ ఎమ్మెల్యేలపై చంద్రబాబు ఆగ్రహం!

  • 2014-19లో ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది
  • దేశంలో ఎక్కడా లేనివిధంగా 11 శాతం వృద్ధి నమోదుచేశాం
  • అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఏపీ ప్రతిపక్ష నేత వ్యాఖ్య

2014-19 మధ్యకాలంలో వ్యవసాయ అభివృద్ధి విషయంలో ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తెలిపారు. దేశంలో ఇతర రాష్ట్రాలకు సాధ్యం కానివిధంగా వ్యవసాయ రంగంలో 11 శాతం అభివృద్ధి సాధించామని అన్నారు. ఈ విషయాన్ని నిన్నే మీ మంత్రి ఒప్పుకునే పరిస్థితికి వచ్చారని వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా సున్నావడ్డీకి రుణాల విషయంలో చంద్రబాబు సీఎం జగన్ సవాల్ ను స్వీకరించాలని వైసీపీ ఎమ్మెల్యేలు గట్టిగా డిమాండ్ చేయడంతో చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ‘కాదండీ.. రికార్డ్స్ ఆయన దగ్గరే ఉన్నాయ్. వెరిఫై చేసుకోమని చెప్పండి. దానికి అభ్యంతరం చెప్పలేదు. ఆయన(జగన్) కు సమాధానం నేను ఎందుకు చెప్పాలి?’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలు నిరసన తెలపడంతో సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది.

Andhra Pradesh
Chandrababu
assembly
Telugudesam
Jagan
Chief Minister
  • Loading...

More Telugu News