Andhra Pradesh: మా ఎమ్మెల్యేకు జరిగిన అవమానంపై సీఎం జగన్ క్షమాపణలు చెప్పాలి!: చంద్రబాబు

  • సీఎంకు ధన్యవాదాలు చెప్పాలన్న మంత్రి పెద్దిరెడ్డి
  • పెద్దిరెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన ఏపీ ప్రతిపక్ష నేత
  • జగన్ క్షమాపణ చెబితే తాను ధన్యవాదాలు చెబుతానని మెలిక

ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు చంద్రబాబు ధన్యవాదాలు చెప్పాలని మంత్రి పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఏపీ ప్రతిపక్ష నేత స్పందించారు. ప్రకాశం జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యే బాలవీరాంజనేయ స్వామికి జరిగిన అవమానానికి సీఎం జగన్ క్షమాపణలు చెబితే, తాను ఇప్పుడు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు చెబుతానని చంద్రబాబు స్పష్టం చేశారు.

‘మీరు చేయాల్సిన పనులను మీరు చేస్తూ నీతులు చెప్పడం మంచిది కాదు రామచంద్రారెడ్డి గారూ’ అని హితవు పలికారు. ఓ ఎస్సీ ఎమ్మెల్యేను రైతు సదస్సుకు రాకుండా చేశారంటే ఎంత దౌర్జన్యం? ఒక ఎమ్మెల్యేను దబాయించే పరిస్థితికి వచ్చారు. ఇదే రౌడీయిజం. మీరు (నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి) పత్రికా విలేకరిని బెదిరించారు. దానికి ముఖ్యమంత్రి జగన్ జవాబు చెప్పాలి’ అని చంద్రబాబు డిమాండ్ చేశారు.

Andhra Pradesh
YSRCP
Jagan
Chief Minister
Chandrababu
Telugudesam
say sorry
  • Loading...

More Telugu News