Crime News: మత్తు మాత్రలు మింగి పంజాబీ దంపతుల ఆత్మహత్యా యత్నం!

  • హైదరాబాద్‌ అంబర్‌పేట డీడీ కాలనీలో ఘటన
  • స్థానికంగా కలకలానికి కారణమైన సంఘటన
  • కారణాలు తెలియరాలేదు

పంజాబ్‌ రాష్ట్రానికి చెందిన ఓ జంట కూల్‌ డ్రింక్‌లో మత్తు బిళ్లలు కలుపుకొని ఆత్మహత్యా ప్రయత్నం చేయడం కలకలానికి కారణమైంది. హైదరాబాద్‌లోని అంబర్‌పేట్‌ డీడీ కాలనీలో ఈ సంఘటన చోటుచేసుకుంది. అపస్మారక స్థితిలో ఉన్న దంపతులను ఈరోజు గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని దంపతులను ఆంధ్ర మహిళా సభ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వీరిద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. వీరు ఎందుకు ఆత్మహత్యా యత్యం చేశారన్నది తెలియరాలేదు.

Crime News
punjab
couple suicide
hyderabad amberpet
  • Loading...

More Telugu News