Andhra Pradesh: చంద్రబాబూ.. ఏపీ విభజన సమయంలో మౌనంగా ఎందుకున్నారు.. సోనియాగాంధీ అంటే భయమా?: సీఎం జగన్

  • శ్రీశైలం, నాగార్జునసాగర్ ఏపీకివ్వాలని ఎందుకు కోరలేదు?
  • ఇన్నేళ్లు సీఎం అంటాడు.. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటాడు
  • ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబుపై విరుచుకుపడ్డ సీఎం జగన్

ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిపై ముఖ్యమంత్రి జగన్ ఈరోజు బడ్జెట్ సమావేశాల సందర్భంగా తీవ్రంగా మండిపడ్డారు. ఏపీ ఈరోజు ఇంత ఆధ్వానమైన పరిస్థితుల్లో ఉందంటే చంద్రబాబు అనే వ్యక్తి ఐదేళ్లు పరిపాలించడమే కారణమని దుయ్యబట్టారు. ‘అధ్యక్షా నేను అడుగుతున్నా. మనం-తెలంగాణ ప్రభుత్వం కలిసి గోదావరి నీటిని శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు తీసుకెళితే రెండు రాష్ట్రాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలు జరగవా అధ్యక్షా? బుద్ధీ,   జ్ఞానం ఉన్న ఎవరికైనా ఇది అర్థం కాదా అధ్యక్షా? ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి అంటాడు. 40 సంవత్సరాల ఇండస్ట్రీ అంటాడు. ఇంకోటి అంటాడు. ఇంకోటి అంటాడు.

నిజంగానే రెండు రాష్ట్రాలు కలిసి తీసుకెళ్లే నీళ్లు ఎక్కడికి అధ్యక్షా.. ఆ రెండు ప్రాజెక్టుల్లో (శ్రీశైలం, నాగార్జున సాగర్) నీటిని రెండు రాష్ట్రాలే వాడుకుంటున్నాయి. అటు తెలంగాణ జిల్లాలు బాగుపడతాయి. ఇటు ఏపీ జిల్లాలు బాగుపడతాయి. దీనిపై సంతోషించాల్సింది పోయి ఇదేంటి? ద్వైపాక్షిక ఒప్పందాలను జగన్, కేసీఆర్ చేసుకోవడం లేదు. ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య, ఐఏఎస్ అధికారుల మధ్య జరుగుతోంది.

నిజంగానే ఇది సమస్య అవుతుందని చెబితే ఏపీ విభజన సందర్భంగా చంద్రబాబు ఎందుకు మద్దతు ఇచ్చి రాష్ట్రాన్ని విడగొట్టారు. శ్రీశైలం మాకు ఇవ్వండి. నాగార్జునసాగర్ మాకు ఇవ్వండి అని చంద్రబాబు ఎందుకు అడగలేదు? ఏం.. సోనియాగాంధీ అంటే భయమా? ఈరోజు శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులో ఏపీ-తెలంగాణకు మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలు ఉన్నాయి. ఇవన్నీ తెలిసి కేవలం ప్రజల్లో తప్పుడు అభిప్రాయం కల్పించడం కోసం ఇలా చేస్తున్నారు. మీ హయాంలో ఇది జరగలేదని ఓర్వలేకపోతున్నారు.

కేసీఆర్ తో కలవకుండా కేంద్రం కుట్ర చేసిందని చంద్రబాబు గతంలో అన్నారు. హైదరాబాద్ లో హరికృష్ణ అంత్యక్రియలకు మా కొడాలి నాని వెళ్లాడు. అప్పుడే అంత్యక్రియల కోసం అక్కడికి వచ్చిన కేటీఆర్ తో పొత్తుల కోసం మాట్లాడాడు ఈ పెద్దమనిషి. అప్పుడు కొడాలి నాని అక్కడే ఉన్నాడు’ అని వ్యాఖ్యానించారు ఈ ప్రపంచంలో చంద్రబాబు అంత దుర్మార్గమైన నాయకుడు ఎవరూ ఉండరని సీఎం జగన్ దుయ్యబట్టారు.

Andhra Pradesh
Jagan
Chief Minister
Chandrababu
Telugudesam
assembly session
  • Loading...

More Telugu News