cricket: టీమిండియా ఓటమితో అభిమానికి గుండెపోటు.. టీవీ ముందే కుప్పకూలి మృత్యువాత

  • విజయనగరం జిల్లాలో ఘటన 
  • నిన్న భారత్‌, న్యూజిల్యాండ్‌ సెమీఫైనల్‌ మ్యాచ్ వీక్షిస్తుండగా విషాదం
  • తోటి ఉద్యోగుల్లో విషాదం

క్రికెట్‌ ప్రపంచకప్‌ సెమీఫైనల్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో భారత్‌ ఓటమిని జీర్ణించుకోలేని ఓ అభిమాని గుండె పోటుతో మృతి చెందాడు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం విజయనగరం జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని పూసపాటిరేగ మండలం రెల్లివలస గ్రామానికి చెందిన మీసాల రాము (35) విజయనగరంలోని ఎంవీజీఆర్‌ కళాశాలలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. నిన్నసాయంత్రం వరకు తోటి ఉద్యోగులతో సరదాగా గడిపిన అనంతరం క్రికెట్‌ మ్యాచ్‌ చూసేందుకు ఇంటికి వెళ్లిపోయాడు. ఉత్కంఠగా జరిగిన మ్యాచ్‌ను చూస్తూ టెన్షన్‌కి గురయ్యాడు. భారత్‌ ఓటమి అంచుకు చేరగానే తీవ్రమైన ఒత్తిడికి లోనై కుప్పకూలిపోయాడు. స్థానికులు ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేస్తుండగానే ప్రాణాలు విడిచాడు. రాముకు భార్య, ఒక కొడుకు ఉన్నారు. ఈ ఘటన కుటుంబ సభ్యులు, సహచరులు, తోటి ఉద్యోగుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

cricket
team India defeat
fan died with heart attack
Vijayanagaram District
  • Loading...

More Telugu News