Crime News: తల్లీకొడుకులపై కిరోసిన్‌ పోసి నిప్పంటించిన దుండగులు.. అక్కడికక్కడే మృతి!

  • ఈరోజు తెల్లవారు జామున ఘటన
  • సంగారెడ్డి జిల్లా కారస్‌గుత్తిలో ఘోరం
  • హత్యకు కారణాలు తెలియరాలేదు

 గుర్తు తెలియని వ్యక్తులు తల్లీ కొడుకులపై కిరోసిన్‌ పోసి నిప్పంటించి హత్య చేసిన ఘటన స్థానికంగా సంచలనమైంది. తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా నాగల్‌గిద్ద మండలం కారస్‌గుత్తిలో ఈరోజు తెల్లవారు జామున ఈ ఘాతుకం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సుజాత (35), ఆమె కొడుకు (4)పై దుండగులు దాడిచేశారు. అనంతరం కిరోసిన్‌పోసి నిప్పంటించారు. మంటల్లో చిక్కుకున్న బాధితులు అక్కడికక్కడే చనిపోయారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న నాగల్‌గిద్ద పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఈ ఘటన వెనుక కారణాలు తెలియరాలేదు. అయితే మృతురాలి భర్తను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

Crime News
mother and son murdered
Sangareddy District
  • Loading...

More Telugu News