Madarasa: చిన్నారులకు చదువు చెప్పాల్సిన చోట అక్రమ ఆయుధాలు.. ఆరుగురి అరెస్ట్

  • అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రాలుగా మదరసాలు
  • ఉత్తరప్రదేశ్ లోని మదరసాపై పోలీసుల దాడి
  • ఐదు తుపాకులు, బుల్లెట్లు స్వాధీనం

ముస్లిం విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన కొన్ని మదరసాలు అసాంఘిక కార్యకలాపాలకు స్థావరాలుగా మారుతున్నాయి. తాజాగా, ఉత్తరప్రదేశ్ లోని షేర్ కోట్ లో ఉన్న ఓ మదరసాపై దాడి చేసిన పోలీసులు, అక్కడ ఉంచిన అక్రమ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మదరసాలో 25 మంది చిన్నారులు చదువుకుంటున్నారు. మదరసాలో ఆయుధాలు ఉన్నట్టు పక్కా సమాచారం అందడంతో... పోలీసులు మెరుపు దాడి చేశారు.

ఈ సందర్భంగా సర్కిల్ పోలీస్ ఆఫీసర్ కనోజియా మాట్లాడుతూ, కొందరు సంఘ విద్రోహ శక్తులు ఈ మదరసాకు వచ్చినట్టు తమకు సమాచారం అందిందని తెలిపారు. మదరసాలో తాము తనిఖీలు చేపట్టి... ఐదు తుపాకులు, పెద్ద సంఖ్యలో బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నామని, ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. దీనికి సంబంధించిన దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.

  • Loading...

More Telugu News