Andhra Pradesh: ఏపీ మంత్రి కన్నబాబు ఇంట విషాదం.. గుండెపోటుతో సోదరుడి మృతి

  • ఈ ఉదయం గుండెపోటుతో కన్నుమూసిన సురేశ్
  • గతంలో ఈనాడు రిపోర్టర్‌గా పనిచేసిన కన్నబాబు సోదరుడు
  • మృతదేహాన్ని స్వస్థలం కాకినాడ తరలిస్తున్న మంత్రి

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖామంత్రి కురసాల కన్నబాబు ఇంట విషాదం నెలకొంది. 43 ఏళ్ల ఆయన సోదరుడు సురేశ్ ఈ ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. విజయవాడలోని ఆంధ్రా ఆసుపత్రిలో కన్నుమూసిన సురేశ్ మృతదేహాన్ని స్వస్థలం కాకినాడకు తరలిస్తున్నారు.

మంత్రి కన్నబాబుకు ఇద్దరు సోదరులు కాగా, సురేశ్ పెద్ద తమ్ముడు. విశాఖపట్టణంలో ఈనాడు దినపత్రికకు సురేశ్ గతంలో రిపోర్టర్‌గా పనిచేశారు. తర్వాత పాత్రికేయ వృత్తిని వదిలి స్థిరాస్తి వ్యాపారంలోకి అడుగుపెట్టారు. రెండో సోదరుడు కల్యాణ్ కృష్ణ సినీ దర్శకుడు. ‘రారండోయ్ వేడుక చూద్దాం’, ‘సోగ్గాడే చిన్నినాయన’ వంటి సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. కాగా, కన్నబాబు సోదరుడి మృతికి పలువురు నేతలు సంతాపం తెలిపారు.

Andhra Pradesh
kannababu
kurasala suresh
died
Vijayawada
  • Loading...

More Telugu News