Jagan: జగన్ గారు.. ఈడీ, సీబీఐ కేసులు ఉన్న మీరు వ్యవస్థను ఎలా కడగగలరు?: కేశినేని నాని

  • వ్యవస్థను సమూలంగా కడిగేద్దామన్న జగన్
  • ముందు మనల్ని మనం కడుక్కోవాలన్న నాని
  • కడిగిన ముత్యాలు మాత్రమే వ్యవస్థలను కడగగలవంటూ వ్యాఖ్య

ఏపీలో అధికార, విపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వ్యవస్థను సమూలంగా కడిగేద్దామని ముఖ్యమంత్రి జగన్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. తన స్థాయిలో వ్యవస్థను శుభ్రం చేసే పనిని తాను ప్రారంభించానని... జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు కూడా అదే చేయాలని ఆయన అన్నారు. మీరిద్దరూ మనసు పెడితే అవినీతిని సమూలంగా నిర్మూలించడం సాధ్యమేనని చెప్పారు.

జగన్ చేసిన ఈ వ్యాఖ్యలపై టీడీపీ ఎంపీ కేశినేని నాని ట్విట్టర్ ద్వారా సెటైర్లు వేశారు. 'వ్యవస్థను కడిగే ముందు మనల్ని మనం కడుక్కోవాలి జగన్ గారూ' అంటూ ఆయన ఎద్దేవా చేశారు. కడిగిన మాత్యాలు మాత్రమే వ్యవస్థలను కడగగలవని అన్నారు. ఈడీ, సీబీఐ కేసులు ఉన్న మీరు ఈ వ్యవస్థను ఎలా కడుగుతారంటూ ప్రశ్నించారు.

Jagan
Kesineni Nani
Telugudesam
YSRCP
Corruption
  • Loading...

More Telugu News