nowhera shaik: నౌహీరా షేక్‌ను బళ్లారి తీసుకెళ్లిన పోలీసులు
- మదుపుదార్లను కోట్లలో ముంచేసిన నౌహీరా
- ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో
- న్యాయస్థానం అనుమతితో బళ్లారి తీసుకెళ్లిన పోలీసులు
బంగారంలో పెట్టుబడులు పెడితే అధిక వడ్డీ ఇస్తామని మదుపుదార్ల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసిన కేసులో హీరా గ్రూప్ సంస్థల ఎండీ నౌహీరా షేక్ ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉంది. దాదాపు లక్షమంది నుంచి రూ.6 వేల కోట్లు వసూలు చేసినట్టు హైదరాబాద్ సీసీఎస్ పోలీసుల దర్యాప్తులో తేటతెల్లమైంది. ఏపీ, తెలంగాణలోనే కాకుండా కర్ణాటక, ముంబై, ఢిల్లీలోనూ ఆమెపై కేసులు నమోదయ్యాయి.
తాజాగా బళ్లారిలో నమోదైన ఓ కేసులో దర్యాప్తు కోసం నౌహీరాను బళ్లారి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నౌహీరాను అదుపులోకి తీసుకోవడానికి ముందు నాంపల్లి కోర్టులో పీటీ వారెంట్ సమర్పించారు. న్యాయస్థానం అనుమతితో ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స నిర్వహించిన అనంతరం బళ్లారి తీసుకెళ్లారు.