Rajendranath Reddy: ఒక్క సేవారంగంలోనే క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నాం: యనమల
- రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పినవన్నీ తప్పుడు లెక్కలే
- వ్యవసాయ రంగంలో 11 శాతం వృద్ధి రేటు సాధించాం
- తలసరి ఆదాయాన్ని రూ.1.64 లక్షలకు పెంచాం
రాష్ట్ర విభజన తరువాత సేవా రంగంలో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నామని, రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆ రంగం మొత్తం హైదరాబాద్‌లో ఉండిపోయిందని మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసిన నేపథ్యంలో గత టీడీపీ ప్రభుత్వంపై వైసీపీ ప్రభుత్వం గుప్పించిన విమర్శలపై యనమల స్పందించారు.
వ్యవసాయ రంగంపై ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పినవన్నీ తప్పుడు లెక్కలేనని విమర్శించారు. 11 శాతం వృద్ధి రేటును వ్యవసాయ రంగంలో సాధించామని యనమల తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో రూ.93 వేలు ఉన్న తలసరి ఆదాయాన్ని, రూ.1.64 లక్షలకు పెంచామన్నారు. సేవా రంగం నుంచి కూడా మంచి రాబడి ఉంటే ఏపీ ఇంకా మెరుగ్గా ఉండేదని యనమల వ్యాఖ్యానించారు.