Devi Sri Prasad: తమ్ముడి పెళ్లి జరిగిందని ఆలస్యంగా వెల్లడించిన దేవిశ్రీప్రసాద్

  • జూన్ 19న వివాహం
  • అదే రోజు దేవిశ్రీ తల్లిదండ్రుల పెళ్లిరోజు
  • ట్వీట్ చేసిన దేవిశ్రీ

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లలో సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ ఒకరు. ఎంతో పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్న దేవిశ్రీ ఇప్పటికీ బ్రహ్మచారే. అయితే, దేవిశ్రీ తమ్ముడు సాగర్ కు మాత్రం పెళ్లయిపోయింది. ఈ విషయాన్ని దేవిశ్రీనే స్వయంగా వెల్లడించాడు. అది కూడా ఎంతో ఆలస్యంగా చెప్పాడు.

 గత నెల 19న తన సోదరుడు సాగర్ వివాహం మౌనిక అనే అమ్మాయితో జరిగిందని, ట్వీట్ చేశాడు. జూన్ 19న తన తల్లిదండ్రుల పెళ్లిరోజు కూడా కావడం విశేషమని డీఎస్పీ తెలిపాడు. ఈ పెళ్లిలో తమ కుటుంబసభ్యులు, బంధుమిత్రులు మాత్రమే పాల్గొన్నట్టు  వెల్లడించాడు.

Devi Sri Prasad
Tollywood
Sagar
Wedding
  • Loading...

More Telugu News