Samantha: ప్రేక్షకుల స్పందన నా నిర్ణయంపై భరోసాను పెంచింది: సమంత

  • ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారోనని భయపడ్డా
  • కెరీర్‌లో ఈ చిత్రం మైలురాయిగా నిలిచిపోతుంది
  • మా చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు

సినిమాను ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో అని భయపడ్డానని, కానీ వారి స్పందన చూస్తుంటే తమ నిర్ణయం సరైనదేనని అనిపించిందని ప్రముఖ కథానాయిక సమంత సంతోషాన్ని వ్యక్తం చేసింది. ‘ఓ బేబీ’ చిత్ర యూనిట్ గుంటూరులో నేడు సందడి చేసింది. అక్కడి ఓ హోటల్లో నిర్వహించిన విజయోత్సవ కార్యక్రమానికి సమంత, దర్శకురాలు నందినీరెడ్డి, తేజ స్నిగ్ద తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ, ఇలాంటి చిత్రానికి ప్రేక్షకుల ఆదరణ ఎలా ఉంటుందోనని భయపడ్డానని తెలిపింది. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో తన నిర్ణయంపై భరోసా కలిగిందని పేర్కొంది. ఈ చిత్రం తన కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోతుందని, ఇంతలా తమ చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు సామ్ ధన్యవాదాలు తెలిపింది. మొబైల్ ఫోన్ల రాకతో కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం తగ్గిపోయిందని, ‘ఓ బేబీ’ చిత్రం ద్వారా కుటుంబాన్ని ఒక్కటి చేసే ప్రయత్నం చేశామని నందినీరెడ్డి పేర్కొన్నారు. ప్రేక్షకుల ఆదరణకు ఆమె ఆనందం వ్యక్తం చేశారు.

Samantha
Nandini Reddy
Teja
Snigdha
O Baby
Mobile Phones
Guntur
  • Loading...

More Telugu News