Anantapur District: రాయదుర్గం మార్కెట్ యార్డ్ వద్ద విషాద ఘటన

  • క్యూలో నిల్చున్న రైతు మృతి
  • వేరుశనగ విత్తనాల కోసం వచ్చిన రైతు
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణం

అనంతపురం జిల్లా రాయదుర్గం మార్కెట్ యార్డులో విషాద ఘటన చోటుచేసుకుంది. వేరుశనగ విత్తనాల కోసం వచ్చిన ఓ రైతు ప్రాణాలు వదిలాడు. రాయదుర్గం మండలం వేపరాళ్లకు చెందిన ఈశ్వరప్ప విత్తనాల కోసం ఉదయం నుంచి క్యూలో నిల్చుని ఉన్నాడు. తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం దక్కలేదు. చికిత్స పొందుతూ ఈశ్వరప్ప మృతి చెందాడు.

Anantapur District
Rayadurgam
Market Yard
  • Loading...

More Telugu News