Andhra Pradesh: మళ్లీ సీఎం కార్యాలయం చెప్పే పరిస్థితి ఉండకూడదు: ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు

  • నష్టపరిహారం వేరొకరు తీసుకోలేని విధంగా చట్టం తీసుకొస్తున్నాం
  • రైతు కష్టాల్లో ఉన్నప్పుడు వారి వద్దకు కచ్చితంగా కలెక్టర్ వెళ్లాలి
  • వీడియో కాన్ఫరెన్స్ లో జగన్ ఆదేశాలు

చనిపోయిన రైతు కుటుంబాలకు ఇచ్చే నష్టపరిహారం వేరొకరు తీసుకోలేని విధంగా చట్టం తీసుకొస్తున్నామని ఏపీ సీఎం జగన్ పేర్కొన్నారు. కలెక్టర్లతో సచివాలయంలో జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్పందన కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులపై సమీక్షించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు ఆ కుటుంబం వద్దకు కచ్చితంగా కలెక్టర్ వెళ్లాలని, ఈ విషయమై మళ్లీ సీఎం కార్యాలయం చెప్పే పరిస్థితి ఉండకూడదని అన్నారు.  

అవినీతిని మండల స్థాయి నుంచి అరికట్టాలని అధికారులను ఆదేశించారు. ‘మీ సేవ’లో ఫలానా సర్టిఫికెట్ కావాలంటే వెంటనే రావాలని అన్నారు. కార్యాలయానికి వెళ్లి లంచం ఇస్తే గానీ పనికావట్లేదని ప్రజలు ఆరోపిస్తున్నారని, అలాంటి అధికారులను పిలిపించుకుని కౌన్సిలింగ్ నిర్వహించాలని జగన్ ఆదేశించారు. తన స్థాయి నుంచి తాను క్లీన్ చేయడం మొదలుపెట్టానని, అధికారులు వారి స్థాయిలో వారు మండల స్థాయి అధికారులను పిలిపించుకుని క్లీన్ చేయాలని అన్నారు.   

  • Loading...

More Telugu News