Andhra Pradesh: వైసీపీ నేత ఆమంచి రాజేంద్ర తిట్లపురాణం.. పోలీసులను ఆశ్రయించిన హోంగార్డు రవికుమార్!

  • ఈపురుపాలెం పీఎస్ లో హోంగార్డుగా రవికుమార్
  • గతంలో చేసిన వ్యాఖ్యలపై ఫోన్ చేసి తిట్టిన ఆమంచి రాజేంద్ర
  • తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు రవికుమార్ ఫిర్యాదు

ప్రకాశం జిల్లాలో హోంగార్డుగా పనిచేస్తున్న రవికుమార్ పోలీసులను ఆశ్రయించారు. చీరాల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ అన్న కొడుకు ఆమంచి రాజేంద్ర తన కాళ్లు, చేతులు నరికేస్తానని ఫోన్ చేసి బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఆమంచి రాజేంద్ర, ఆయన కుటుంబ సభ్యుల నుంచి తనకు ప్రాణ హాని ఉందనీ, తనకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు.

ఈ మేరకు ఈపురుపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రాజేంద్ర తనతో మాట్లాడిన ఫోన్ కాల్ ఆడియో రికార్డులను పోలీసులకు అందజేశారు. తనకు ఆమంచి రాజేంద్ర 7799227777 నంబర్ నుంచి కాల్ చేశారని తెలిపారు. బయటకు చెప్పలేనిరీతిలో అసభ్యంగా ఆమంచి రాజేంద్ర మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Andhra Pradesh
YSRCP
amanchi rajendra
warning
Police
home guard
ravi kumar
  • Loading...

More Telugu News