Uttarkhand: మరో వివాదంలో బీజేపీ ఎమ్మెల్యే ..మందు కొట్టి.. తుపాకులు పట్టుకుని డ్యాన్స్!

  • ఉత్తరాఖండ్ కు చెందిన ఎమ్మెల్యే కున్వర్ ప్రణవ్ సింగ్
  • తన అనుచరులతో కలిసి ఓ హోటల్ లో ఎంజాయ్
  • సామాజిక మాధ్యమాలకు చేరిన వీడియో

ఉత్తరాఖండ్ లోని ఖాన్ పూర్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే కున్వర్ ప్రణవ్ సింగ్ వివాదాలకు మారుపేరు. ఇటీవలే తన కాలికి శస్త్ర చికిత్స చేయించుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ సంతోషంలో తన అనుచరులతో కలిసి డెహ్రాడూన్ లోని ఓ హోటల్ లో ఎంజాయ్ చేశారు. మద్యం సేవిస్తూ, ఓ బాలీవుడ్ పాటకు ప్రణవ్ చిందేశారు. అయితే, మందేసి, చిందేసిన ప్రణవ్ తన తుపాకులను చేతిలో పెట్టుకుని ప్రదర్శించడం సంచలనం రేకెత్తిస్తోంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాలకు చేరడంతో ఈ విషయం బయటపడింది. దీనిపై నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ప్రణవ్ ను పార్టీ నుంచి కొన్ని నెలల పాటు బహిష్కరించారు. మరోమారు వివాదంలో చిక్కుకున్న ప్రణవ్ పై బీజేపీ అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.

Uttarkhand
Khanpur
Bjp
Mla
Kunwar pranav
  • Loading...

More Telugu News