Karnataka: వర్షం కురుస్తున్నా, అడుగు కూడా వేయకుండా నిలబడే ఉన్న డీకే శివకుమార్!

  • రెబల్స్ ను కలవకుండా వెళ్లబోను
  • బీజేపీ నినాదాలకు భయపడేది లేదు
  • ముంబై హోటల్ ముందు శివకుమార్

ముంబైలోని ఓ హోటల్ లో మకాం వేసిన రెబల్ ఎమ్మెల్యేలను కలవకుండా తాను కదిలేది లేదని తేల్చి చెబుతున్న కర్ణాటక కాంగ్రెస్ నేత, మంత్రి డీకే శివకుమార్, భారీ వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా హోటల్ బయటే ఉన్నారు. ఈ ఉదయం నుంచి హోటల్ ముందు హై డ్రామా నడుస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర రాజకీయాల్లో ఎటువంటి సంక్షోభం ఏర్పడినా, పరిష్కరించగల సత్తా ఉన్న నేతగా పేరున్న శివకుమార్, ఈ ఉదయం హోటల్ లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. లోపల ఉన్న ఎమ్మెల్యేలు కోరితేనే శివకుమార్ ను పంపిస్తామని పోలీసులు కరాఖండీగా చెప్పారు.

మరోవైపు లోపలున్నవారిని సంప్రదించేందుకు కాంగ్రెస్ నేతల ప్రయత్నాలు ఫలించడం లేదు. రెబల్ ఎమ్మెల్యేలను కలవాల్సిందేనని పట్టుబట్టిన శివకుమార్, తాను ముంబైకి ఒక్కడినే వచ్చానని, బీజేపీ కార్యకర్తల నినాదాలకు భయపడేవాడిని కాదని హెచ్చరించారు. తాను హోటల్ లో గదిని బుక్ చేసుకుంటే, దాన్ని కూడా రద్దు చేశారని ఆరోపించారు.

Karnataka
Mumbai
Rebels
MLAs
DK Sivakumar
  • Loading...

More Telugu News