Andhra Pradesh: ఏపీలో బీజేపీ బలమైన పార్టీగా అవతరించనుంది: కన్నా లక్ష్మీనారాయణ

  • బీజేపీలో చేరేందుకు పలు పార్టీల నాయకులు రెడీ
  • వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాం
  • దేశంలో ఎక్కువ సభ్యత్వాలు ఉన్న పార్టీ బీజేపీయే

బీజేపీలో చేరేందుకు పలు పార్టీల నేతలు సిద్ధంగా ఉన్నారని ఏపీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ అన్నారు. కడపలో ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ, బీజేపీలో చేరేందుకు వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీల నాయకులు రెడీగా ఉన్నారని చెప్పారు. ఏపీలో బీజేపీ బలమైన పార్టీగా అవతరించనుందని, వచ్చే ఎన్నికల్లో గెలిచి అధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నామని అన్నారు. దేశంలో ఎక్కువ సభ్యత్వాలు ఉన్న పార్టీ బీజేపీయే అని చెప్పారు. అంతకుముందు, కడపలోని విజయ దుర్గాదేవి ఆలయాన్ని కన్నా సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితులు ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.

Andhra Pradesh
bjp
kanna
lakshmi narayana
  • Loading...

More Telugu News