Prakasam District: వాగులో దంపతుల మృతదేహాలు...స్థానికంగా సంచలనం

  • మృతులు ఎవరో...ఎలా చనిపోయారో తెలియని వైనం
  • పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు
  • ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలంలో ఘటన

గుర్తు తెలియని దంపతుల మృతదేహాలు వాగులో కొట్టుకురావడంతో చూసిన వారు కంగుతిన్నారు. మృతులు ఎవరు? ఎలా చనిపోయారు? అన్నది అర్థంకాక పలు రకాల ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ఉయ్యాలవాడ సమీపంలో ఓ వాగులో దంపతుల మృతదేహాలు పడివున్నాయి. అటుగా వెళ్లిన వారు ఈ మృతదేహాలను చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించారు.

మృతులు స్థానికులు కాదని అక్కడి వారు చెప్పడంతో, ఎవరైనా వాగులో దూకి ఆత్మహత్య చేసుకోగా మృతదేహాలు ఇక్కడకు కొట్టుకు వచ్చాయా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Prakasam District
giddaluru
deadbodies in canal
  • Loading...

More Telugu News