hrithik roshan: తెలంగాణ హైకోర్టులో నటుడు హృతిక్ రోషన్‌కు ఊరట

  • కల్ట్‌ఫిట్‌ హెల్త్‌కేర్‌ సంస్థకు అంబాసిడర్‌గా హృతిక్
  • బరువు తగ్గుతారని తప్పుడు ప్రకటనలతో మోసం చేశారని ఫిర్యాదు
  • క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన హృతిక్

బాలీవుడ్ ప్రముఖ నటుడు హృతిక్ రోషన్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. తనపై నమోదైన ఆరోపణల్లో నిజం లేదని, కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన హైకోర్టును ఆశ్రయించాడు. వాదనలు విన్న న్యాయస్థానం పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ పోలీసులు, ఫిర్యాదుదారుడికి నోటీసులు జారీచేసింది. కేసును నాలుగు వారాలపాటు వాయిదా వేసింది. కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే..

కూకట్‌పల్లిలోని కల్ట్‌ఫిట్‌ హెల్త్‌కేర్‌ సంస్థకు అంబాసిడర్‌గా ఉన్న హృతిక్ రోషన్ బరువు తగ్గుతారంటూ తప్పుడు ప్రకటనలతో మోసం చేశారని శ్రీకాంత్ అనే యువకుడు హృతిక్‌తోపాటు కల్ట్ ఫిట్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదుతో సంస్థ డైరెక్టర్లతోపాటు నటుడిపైనా పోలీసులు కేసు నమోదు చేశారు.

తమపై కేసులు నమోదు కావడంపై స్పందించిన సంస్థ డైరెక్టర్లు, హృతిక్ రోషన్ హైకోర్టును ఆశ్రయించారు. శ్రీకాంత్ చేసిన ఫిర్యాదులో వాస్తవం లేదని, కేసును కొట్టివేయాలంటూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. వాదనలు విన్న న్యాయస్థానం విచారణను నాలుగు వారాలు వాయిదా వేసింది. అప్పటి వరకు సంస్థపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది.

hrithik roshan
Bollywood
Telangana
High Court
  • Loading...

More Telugu News