Andhra Pradesh: ఏపీ శాసనసభ బడ్జెట్ సమావేశాల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ

  • నోటిఫికేషన్ జారీ చేసిన గవర్నర్ నరసింహన్
  • ఎల్లుండి ఉదయం 9 గంటలకు సమావేశాలు ప్రారంభం
  • ఈ నెల 12న బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న మంత్రి బుగ్గన

ఈ నెల 11 నుంచి ఏపీ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఎల్లుండి ఉదయం 9 గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నట్టు పేర్కొన్నారు. కాగా, ఈ నెల 12న వైసీపీ ప్రభుత్వ తొలి బడ్జెట్ ను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. అదే రోజున వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి కురసాల కన్నబాబు సభ ముందు ఉంచుతారు. 

Andhra Pradesh
cabinet
budget
notification
Governer
Narasimhan
YSRCP
cm
jagan
  • Loading...

More Telugu News