India: మాంచెస్టర్ లో వర్షం... నిలిచిపోయిన టీమిండియా-కివీస్ మ్యాచ్

  • మరింత పెరుగుతున్న వర్షం
  • మైదానాన్ని కవర్లతో కప్పిన సిబ్బంది
  • వర్షం పడే సమయానికి కివీస్ 46.1 ఓవర్లలో 211/5

మాంచెస్టర్ లో టీమిండియా, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్ కు వరుణుడు అడ్డం తగిలాడు. మరికాసేపట్లో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ముగుస్తుందనగా, వర్షం మొదలవడంతో మ్యాచ్ నిలిపివేశారు. మైదానాన్ని చాలావరకు కవర్లతో కప్పివేశారు. వర్షం కారణంగా పోరు ఆగిపోయే సమయానికి కివీస్ 46.1 ఓవర్లలో 5 వికెట్లకు 211 పరుగులు చేశారు. క్రీజులో రాస్ టేలర్ (67), టామ్ లాథమ్ (3) ఉన్నారు. వర్షం మరింత పెరగడంతో మ్యాచ్ ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక వేళ మ్యాచ్ సాధ్యమైన పక్షంలో ఓవర్లు కుదించాల్సి వస్తే, టీమిండియా లక్ష్యం 20 ఓవర్లలో 148 పరుగులు కానీ, 46 ఓవర్లలో 237 పరుగులు కానీ అవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

India
New Zealand
Rain
Semis
World Cup
  • Loading...

More Telugu News