Muralidhar Rao: ఎన్ని దాడులు చేసినా పోరాటం ఆపవద్దని అధిష్ఠానం ఆదేశించింది: బీజేపీ జాతీయ నేత మురళీధర్‌రావు
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-17ba5c63f12e8c46b7d929439452d13089377409.jpg)
- టీఆర్ఎస్ అవినీతిమయమైన పార్టీ
- డబుల్ బెడ్ రూం ఇళ్లు కాగితాలకే పరిమితం
- హామీలను అమలు చేస్తున్న ఘనత బీజేపీదే
ఎన్ని దాడులు చేసినా, హత్యలు చేసినా మన పోరాటం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపవద్దని పార్టీ ఆదేశించిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు పేర్కొన్నారు. నేడు ఆయన భువనగిరిలో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ అవినీతితో నిండిపోయిందని, రాష్ట్రంలో కట్టిస్తామన్న డబుల్ బెడ్ రూం ఇళ్లు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని ధ్వజమెత్తారు. తెలంగాణ, ఏపీలకు ఏవైతే హామీలు ఇచ్చామో వాటిని పక్కాగా అమలు చేస్తున్న ఘనత తమ పార్టీకే దక్కుతుందని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పని అయిపోయిందని, ఇక కనుమరుగవడం ఖాయమని అన్నారు.