Andhra Pradesh: అసెంబ్లీ సందర్శనకు వచ్చే వారి సంఖ్య పరిమితం చేయాలి: ఏపీ స్పీకర్ తమ్మినేని ఆదేశం

  • రోజుకు 500 మందిని మాత్రమే అనుమతించాలి
  • 70 మంది సభ్యులు తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు
  • అసెంబ్లీ ఆవరణలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలి

భద్రతా కారణాల రీత్యా ఏపీ అసెంబ్లీకి వచ్చే సందర్శకుల సంఖ్యను పరిమితం చేయాలని, రోజుకు ఐదువందల మందిని మాత్రమే అనుమతించాలని స్పీకర్ తమ్మినేని సీతారాం ఆదేశించారు. ఏపీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై స్పీకర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉన్నతాధికారులకు పలు సూచనలు చేశారు. అసెంబ్లీ సమావేశాలకు భద్రతా ఏర్పాట్లు, బందోబస్తు, సమన్వయం కోసం అసెంబ్లీ ఆవరణలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 70 మంది సభ్యులు తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారని, వాస్తవిక దృక్పథంతో ఈ సమావేశాలు జరిగేలా కృషి చేద్దామని, సభలో మాట్లాడేందుకు అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తామని చెప్పారు.

Andhra Pradesh
Assembly
speaker
Tammineni
  • Loading...

More Telugu News