TRS: నాపై సోమారపు ఆరోపణలను ఖండిస్తున్నా: ఎమ్మెల్యే బాల్క సుమన్

  • సొంత పార్టీ నేతలను ఓడించాలనే వ్యక్తిత్వం నాది కాదు
  • నా గెలుపు కోసమే నేను కష్టపడ్డా 
  • సోమారపు రాజకీయాలు ఏంటో రామగుండం ప్రజలకు తెలుసు

టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన సోమారపు సత్యనారాయణ తనపై చేసిన ఆరోపణలను చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ ఖండించారు. సొంత పార్టీ నేతలను ఓడించాలని చూసే వ్యక్తిత్వం తనది కాదని, మొన్నటి ఎన్నికల్లో తన గెలుపు కోసమే తాను కష్టపడ్డాను తప్ప వేరే వాళ్ల ఓటమికి తాను ప్రయత్నించలేదని అన్నారు. సోమారపు రాజకీయాలు ఏంటో రామగుండం ప్రజలకు తెలుసని, టీఆర్ఎస్ ను  ఆయన వీడటం వల్ల వచ్చిన నష్టమేమీ లేదని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీలో ఆయనకు సముచిత స్థానం కల్పించామని అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీలపై ఆయన విరుచుకుపడ్డారు. తమ ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు చూపెట్టాలని, తాము చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు.

TRS
somarapu satyanarayna
mla
balka suman
  • Loading...

More Telugu News