Balakot: బాలాకోట్ దాడులతో ఉగ్రవాదుల చొరబాట్లు 43 శాతం తగ్గాయి: కేంద్ర ప్రభుత్వం

  • జమ్ముకశ్మీర్ లో పరిస్థితి మెరుగవుతోంది
  • చొరబాట్లపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది
  • పార్లమెంటుకు తెలిపిన నిత్యానంద్ రాయ్

పాకిస్థాన్ భూభాగంలోని బాలాకోట్ ఉగ్రస్థావరాలపై భారత వాయుసేన దాడులు నిర్వహించిన తర్వాత... మన దేశంలోకి ఉగ్రవాదుల చొరబాట్లు 43 శాతం తగ్గాయి. ఈ విషయాన్ని పార్లమెంటులో నేడు కేంద్ర హోం శాఖ ప్రకటించింది. భద్రతాబలగాల నిరంతర కృషి వల్ల 2018తో పోలిస్తే ఈ ఏడాది జమ్ముకశ్మీర్ లో పరిస్థితి మెరుగవుతోందని తెలిపింది.

హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్ రాయ్ మాట్లాడుతూ, సరిహద్దుల్లో చొరబాట్లపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందని తెలిపారు. అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖల వద్ద భద్రతాబలగాలను పెంచడం, బోర్డర్లో ఫెన్సింగ్ వేయడం, నిఘా వ్యవస్థను ఆధునికీకరించడం, కార్యకలాపాల నిర్వహణలో వివిధ విభాగాల మధ్య సహకారం వంటివి చొరబాట్లు తగ్గుముఖం పట్టడంలో కీలకపాత్ర పోషించాయని చెప్పారు.

Balakot
Air Strikes
Infiltration
Home Ministry
Nityanad Rai
  • Loading...

More Telugu News