Nara Lokesh: ప్రెస్ మీట్ పెట్టి మంగళగిరి, డెంగ్యూ పదాలను లోకేశ్ పలకాలి: వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు సవాల్

  • నాలుగు పదాలు కూడా సరిగా పలకలేని లోకేష్ మాట్లాడుతున్నారు
  • ప్రజలు తిరస్కరించినా చంద్రబాబు, లోకేశ్ కు బుద్ధి రాలేదు
  • పదవుల కోసం ఎంతకైనా దిగజారుతారు

టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేశ్ పై వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు సెటైర్లు వేశారు. నాలుగు పదాలను కూడా సరిగా పలకలేని లోకేశ్... జగన్, విజయసాయిరెడ్డిల గురించి మట్లాడటం విడ్డూరంగా ఉందని అన్నారు. ప్రెస్ మీట్ పెట్టి మంగళగిరి, డెంగ్యూ, గుంటూరు పదాలను పలకాలని సవాల్ విసిరారు. ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించినా చంద్రబాబు, లోకేశ్ కు బుద్ధి రాలేదని అన్నారు. పదవుల కోసం ఎంతకైనా దిగజారుతారని విమర్శించారు.

పాములు బయటకొచ్చాయని లోకేశ్ చెప్పిన మాట నిజమేనని... గత ఐదేళ్లలో చాలా పాములు బయటకు వచ్చాయని... వాటిని ప్రజలు చావగొట్టారని సుధాకర్ బాబు అన్నారు. కేవలం 23 పాములు మాత్రమే తప్పించుకున్నాయని... స్థానిక ఎన్నికల్లో ఒక్క అవినీతి పాము కూడా గెలవదని చెప్పారు. టీడీపీ నేతల అవినీతి భాగోతాన్ని అసెంబ్లీ సాక్షిగా బయటపెడతామని అన్నారు.

Nara Lokesh
Sudhakar Babu
Telugudesam
YSRCP
Chandrababu
Jagan
Vijay Sai Reddy
  • Loading...

More Telugu News