Lok Sabha: లోక్ సభ నుంచి వాకౌట్ చేసిన కాంగ్రెస్ ఎంపీలు

  • కర్ణాటక సంక్షోభంపై దద్దరిల్లుతున్న పార్లమెంట్
  • అంతటికీ బీజేపీనే కారణమన్న కాంగ్రెస్
  • ఇది కాంగ్రెస్ ఇంటిపోరు అన్న రాజ్ నాథ్

కర్ణాటకలో చోటుచేసుకున్న రాజకీయ సంక్షోభంపై లోక్ సభ దద్దరిల్లింది. దీనికంతా బీజేపీనే కారణమంటూ కాంగ్రెస్ ఎంపీలు సభలో నినాదాలు చేశారు. దీనికి నిరసనగా సభ నుంచి వాకౌట్ చేశారు. ఈ సందర్భంగా సభలో కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ, ఇతర పార్టీల మనుగడను అంతం చేయాలనుకునే రాజకీయలకు ముగింపు పలకాలని అన్నారు.

మరోవైపు, కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ, కర్ణాటకలో జరుగుతన్నదంతా కాంగ్రెస్ పార్టీ ఇంటిపోరు అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తన ఇంటి వివాదాన్ని పరిష్కరించుకోకుండా... లోక్ సభ సమావేశాలకు ఆటంకం కలిగిస్తోందని మండిపడ్డారు. రాజ్యసభలో కూడా ఇదే గందరగోళం నెలకొనడంతో... సభను సభాపతి మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.

Lok Sabha
Rajya Sabha
Karnataka
Congress
BJP
Walk Out
  • Loading...

More Telugu News